రాజ్ ఠాక్రేకు తనపై క్రష్ ఉండేదన్న ప్రచారం.. సోనాలి తీవ్ర అసహనం! రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం..
Sat Jun 07, 2025 17:49 Entertainment
బాలీవుడ్ ప్రముఖ నటి సోనాలి బింద్రే, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అధినేత రాజ్ థాకరేకు సంబంధించిన ఓ పాత వీడియో ఇటీవల వైరల్ కావడంతో వారిద్దరి మధ్య ఏదో ఉందంటూ సామాజిక మాధ్యమాల్లో చెలరేగిన వదంతులపై నటి స్పందించారు. ఈ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని ఆమె తేల్చిచెప్పారు. చాలా ఏళ్ల క్రితం రాజ్ థాకరేకు తనపై ఇష్టం ఉండేదన్న ప్రచారంపై కూడా ఆమె పెదవి విప్పారు. ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ, సోనాలి బింద్రే ఈ ఊహాగానాలను కొట్టిపారేశారు. "ఆయనకు నాపై అప్పట్లో క్రష్ ఉండేదా? నాకైతే అనుమానమే" అని ఆమె అన్నారు. వైరల్ అయిన వీడియో గురించి వివరిస్తూ, "ఆ సమయంలో నేను అక్కడే ఉన్న నా సోదరితో మాట్లాడుతున్నాను" అని స్పష్టం చేశారు. ఇలాంటి నిరాధారమైన వార్తలు ప్రచారం చేయడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. "ఇలాంటి విషయాల గురించి మాట్లాడటం సరైన పద్ధతి కాదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే దీని వెనుక కుటుంబాలు, వ్యక్తులు ముడిపడి ఉంటారు" అని సోనాలి ఆవేదన వ్యక్తం చేశారు. తమ రెండు కుటుంబాల మధ్య దశాబ్దాల నాటి పరిచయం ఉందని సోనాలి బింద్రే గుర్తుచేసుకున్నారు.
ఇది కూడా చదవండి: ఎస్బీఐ కస్టమర్లకు బిగ్ అలర్ట్.. ఇకపై ఈ నెంబర్ల నుంచే కాల్స్.. లిస్ట్ ఇదిగోండి!
"మా బావగారు క్రికెటర్. ఆయన, రాజ్ థాకరే కజిన్ కలిసి క్రికెట్ ఆడేవారు. ఆ విధంగా మా సోదరి కుటుంబంతో వారికి పరిచయం ఉంది. అంతేకాకుండా, నేను చదువుకున్న రామ్‌నారాయణ్ రుయా కాలేజీలో మా సోదరి అత్తగారు ఇంగ్లీష్ విభాగానికి హెడ్‌గా ఉండేవారు" అని వివరించారు. కుటుంబాల మధ్య ఉన్న అనుబంధాన్ని మరింత వివరిస్తూ, "నాకు వ్యక్తిగతంగా ఉన్న సంబంధం ఏంటంటే.. రాజ్ థాకరే భార్య షర్మిల వాళ్ళ అమ్మగారు, మా చిన్నమ్మ మంచి స్నేహితులు. షర్మిల వాళ్ళ అమ్మగారు నన్ను పది రోజుల పసికందుగా ఉన్నప్పుడు ఎత్తుకున్నారు కూడా. నేను పుట్టినప్పుడు ఆసుపత్రికి వచ్చి చూశారు. అంత పాత పరిచయం మాది" అని సోనాలి తెలిపారు. "నిజానికి, మా మధ్య ఉన్న సంబంధం అలాంటిది" అని ఆమె చెప్పారు. అయితే, "నేను మహారాష్ట్రకు సంవత్సరానికి రెండుసార్లు వేసవి సెలవులకు మాత్రమే వచ్చేదాన్ని కాబట్టి వారితో అంతకుమించి పెద్దగా పరిచయం లేదు" అని కూడా ఆమె స్పష్టం చేశారు. రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి ఉందా అని అడిగిన ప్రశ్నకు, సోనాలి బింద్రే సున్నితంగా తిరస్కరించారు. "లేదు, అస్సలు లేదు. రాజకీయాల్లో ఉండాలంటే చాలా మొండితనం కావాలి, అది నా దగ్గర లేదు. దురదృష్టవశాత్తూ, నేను రాజకీయంగా కరెక్ట్‌గా కూడా ఉండలేను" అని ఆమె బదులిచ్చారు.
ఇది కూడా చదవండి: ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
సీనియర్ నేత రాజీనామా.. టీడీపీకి గుడ్ బై చెప్పిన రాయలసీమ ముఖ్యనేత!
పార్టీలో చేరికలపై నేతలకు కీలక ఆదేశాలు జారీ! కేంద్ర కార్యాలయానికి..
జగన్ పెంచి పోషించిన మత్తు భూతం రాష్ట్రాన్ని వదల్లేదు! తిరుపతిలో స్థానికులు ఆగ్రహం వ్యక్తం!
ఆ 8 జిల్లాలతో పాటు విశాఖ ఆర్థిక ప్రాంతం.. లక్ష ఎకరాల్లో ప్రాజెక్టులు.. అదిరిపోయే బాబు ప్లాన్!
అదిరిపోయే శుభవార్త: ఏపీలో భారీగా నిల్వలు.. తవ్వుతుంటే కిలోలకి కిలోలే బయటికి వస్తుంది!
ఏపీ మహిళలకు శుభవార్త! ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తారు, దరఖాస్తు చేసుకోండి!
షుగర్ అని భయపడుతున్నారా.. అయితే దీన్ని తీసుకోవడం వల్ల ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు!
రెడ్ అలర్ట్! ఆ జిల్లాల్లో కుండ పోత వర్షాలు! ప్రజలు బయటకు రావద్దు!
గుడ్ న్యూస్.. మరో రెండు నెలల్లో భారీగా తగ్గనున్న బంగారం ధరలు! 12 - 15% తగ్గే అవకాశం!
బంపర్ ఆఫర్.. దుబాయ్ లాటరీలో విమాన టిక్కెట్లు, ఫోన్లు గెలుచుకోండి ఇలా! ఈ అవకాశం పోతే మళ్ళీ రాదు..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #SonaliBendre #RajThackeray #SonaliBendre RajThackeray #MaharashtraNavnirmanSena
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.